Uncatagorized- source Telugu News papers
National Green Hydrogen mission
భారతదేశంలో, గ్రీన్ హైడ్రోజన్‌పై ఆసక్తి పెరుగుతోంది, ఇది పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించి ఉత్పత్తి చేయబడిన హైడ్రోజన్. గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను గణనీయంగా తగ్గించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది, ఎందుకంటే ఇది కాల్చినప్పుడు కార్బన్ డయాక్సైడ్‌ను ఉత్పత్తి చేయదు
భారతదేశంలో గ్రీన్ హైడ్రోజన్ వాడకం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది మరియు దాని ఉత్పత్తి మరియు వినియోగాన్ని పెంచడానికి అనేక సవాళ్లను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. వీటిలో అధిక ఉత్పత్తి వ్యయం, హైడ్రోజన్ పంపిణీ మరియు నిల్వ కోసం మౌలిక సదుపాయాల కొరత మరియు వివిధ అనువర్తనాల్లో దాని ఉపయోగం కోసం తగిన సాంకేతికతలను అభివృద్ధి చేయవలసిన అవసరం ఉన్నాయి.
గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏమిటి?
గ్రీన్ హైడ్రోజన్ అనేది ఒక రకమైన హైడ్రోజన్, ఇది సౌర లేదా పవన శక్తి వంటి పునరుత్పాదక శక్తి వనరులను ఉపయోగించి నీటి విద్యుద్విశ్లేషణ [electrolysis] ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది.
విద్యుద్విశ్లేషణ ప్రక్రియ నీటిని హైడ్రోజన్ మరియు ఆక్సిజన్‌గా విభజిస్తుంది మరియు ఉత్పత్తి చేయబడిన హైడ్రోజన్‌ను శుభ్రమైన మరియు పునరుత్పాదక ఇంధనంగా ఉపయోగించవచ్చు.
ఉపయోగాలు:
రసాయన పరిశ్రమ: అమ్మోనియా మరియు ఎరువుల తయారీ.
పెట్రోకెమికల్ పరిశ్రమ: పెట్రోలియం ఉత్పత్తుల ఉత్పత్తి.
ఇంకా, ఇది ఉక్కు పరిశ్రమలో ఉపయోగించడం ప్రారంభించబడింది,
గ్రీన్ హైడ్రోజన్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి?
ఉద్గార లక్ష్యాన్ని సాధించడం: భారతదేశం తన జాతీయంగా నిర్ణయించిన సహకారం (NDC) లక్ష్యాలను చేరుకోవడానికి మరియు ప్రాంతీయ మరియు జాతీయ ఇంధన భద్రత, యాక్సెస్ మరియు లభ్యతను నిర్ధారించడానికి గ్రీన్ హైడ్రోజన్ శక్తి చాలా ముఖ్యమైనది.
పారిస్ వాతావరణ ఒప్పందం ప్రకారం, భారతదేశం తన ఆర్థిక వ్యవస్థ యొక్క ఉద్గార తీవ్రతను 2005 స్థాయిల నుండి 2030 నాటికి 33-35% తగ్గించాలని ప్రతిజ్ఞ చేసింది. గ్రీన్ హైడ్రోజన్ భారతదేశాన్ని క్లీన్ ఎనర్జీకి మార్చగలదు, వాతావరణ మార్పులను ఎదుర్కోగలదు.
ఎనర్జీ స్టోరేజ్ మరియు మొబిలిటీ: గ్రీన్ హైడ్రోజన్ శక్తి నిల్వ ఎంపికగా పని చేస్తుంది, ఇది భవిష్యత్తులో అంతరాయాలను (పునరుత్పాదక శక్తి) తీర్చడానికి చాలా అవసరం.
చలనశీలత పరంగా, నగరాలు మరియు రాష్ట్రాలలో లేదా ప్రయాణీకుల కోసం పట్టణ సరుకు రవాణా కోసం సుదూర సమీకరణల కోసం, గ్రీన్ హైడ్రోజన్‌ను రైల్వేలు, పెద్ద ఓడలు, బస్సులు లేదా ట్రక్కులు మొదలైన వాటిలో ఉపయోగించవచ్చు.
దిగుమతి ఆధారపడటాన్ని తగ్గించడం: ఇది శిలాజ ఇంధనాలపై భారతదేశం యొక్క దిగుమతి ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. ఎలక్ట్రోలైజర్ ఉత్పత్తి యొక్క స్థానికీకరణ మరియు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల అభివృద్ధి భారతదేశంలో USD 18-20 బిలియన్ల విలువైన కొత్త గ్రీన్ టెక్నాలజీ మార్కెట్‌ను మరియు వేలాది ఉద్యోగాలను సృష్టించగలవు.
గ్రీన్ హైడ్రోజన్‌కు సంబంధించిన సవాళ్లు ఏమిటి?
అధిక ఉత్పత్తి ఖర్చులు: ప్రస్తుతం, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి శిలాజ ఇంధనాల నుండి ఉత్పత్తి చేయబడిన హైడ్రోజన్ కంటే ఖరీదైనది.
ఎందుకంటే గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే విద్యుద్విశ్లేషణ ప్రక్రియకు పెద్ద మొత్తంలో విద్యుత్ అవసరం మరియు పునరుత్పాదక విద్యుత్ ధర భారతదేశంలో ఇప్పటికీ చాలా ఎక్కువగా ఉంది.
మౌలిక సదుపాయాల కొరత: ప్రస్తుతం భారతదేశంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, నిల్వ మరియు పంపిణీకి మౌలిక సదుపాయాల కొరత ఉంది.
ఇందులో హైడ్రోజన్ ఇంధనం నింపే స్టేషన్లు మరియు హైడ్రోజన్‌ను రవాణా చేయడానికి పైప్‌లైన్‌లు లేకపోవడం.
పరిమిత స్వీకరణ: గ్రీన్ హైడ్రోజన్ యొక్క సంభావ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, భారతదేశంలో ప్రస్తుతం ఈ సాంకేతికత పరిమిత స్వీకరణ ఉంది.
సాధారణ ప్రజల్లో గ్రీన్ హైడ్రోజన్ పట్ల అవగాహన మరియు అవగాహన లేకపోవడం, అలాగే వ్యాపారాలు ఈ టెక్నాలజీకి మారడానికి ప్రోత్సాహకాలు లేకపోవడం దీనికి కారణం.
ఆర్థిక స్థిరత్వం: హైడ్రోజన్‌ను వాణిజ్యపరంగా ఉపయోగించడం కోసం పరిశ్రమ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో గ్రీన్ హైడ్రోజన్ సంగ్రహణ ఒకటి.
రవాణా ఇంధన కణాల కోసం, హైడ్రోజన్ తప్పనిసరిగా ప్రతి-మైలు ప్రాతిపదికన సంప్రదాయ ఇంధనాలు మరియు సాంకేతికతలతో ఖర్చు-పోటీగా ఉండాలి.
ముందుకు వెళ్ళే మార్గం ఎలా ఉండాలి?
పునరుత్పాదక విద్యుత్తును ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని పెంచండి: గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి, భారతదేశంలో పునరుత్పాదక విద్యుత్తును ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని పెంచడం అవసరం.
సౌర మరియు పవన శక్తి వంటి పునరుత్పాదక ఇంధన వనరుల విస్తరణ ద్వారా ఇది చేయవచ్చు.
హైడ్రోజన్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం: ఈ సాంకేతికతను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, నిల్వ మరియు పంపిణీ కోసం మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. హైడ్రోజన్ ఇంధనం నింపే స్టేషన్లు మరియు హైడ్రోజన్ రవాణా కోసం పైప్‌లైన్‌లను నిర్మించడం ఇందులో ఉంది.
రెగ్యులేటరీ ప్రోత్సాహకాలను అమలు చేయండి: ఈ సాంకేతికత ఉత్పత్తి మరియు వినియోగాన్ని ప్రోత్సహించడానికి పన్ను క్రెడిట్‌లు మరియు సబ్సిడీలు వంటి నియంత్రణ ప్రోత్సాహకాలను అమలు చేయడం ద్వారా గ్రీన్ హైడ్రోజన్‌ను స్వీకరించడాన్ని ప్రోత్సహించడంలో ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తుంది.
గ్రీన్ హైడ్రోజన్ గురించి అవగాహన మరియు అవగాహన పెంచుకోండి: గ్రీన్ హైడ్రోజన్ యొక్క ప్రయోజనాలు మరియు గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడే పాత్ర గురించి ప్రజలకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యం.
ఇది ప్రజలకు అవగాహన ప్రచారాలు మరియు విద్యా కార్యక్రమాల ద్వారా చేయవచ్చు.
What is Green Hydrogen?
Green hydrogen is a type of hydrogen that is produced through the electrolysis of water using renewable energy sources such as solar or wind power.
The electrolysis process splits water into hydrogen and oxygen, and the hydrogen produced can be used as a clean and renewable fuel.
Uses:
Chemical industry: Manufacturing ammonia and fertilisers.
Petrochemical industry: Production of petroleum products.
Furthermore, it is starting to be used in the steel industry, a sector which is under considerable pressure in Europe because of its polluting effect.11. అప్పుల కొండపై ఎదిగిన అదానీ
---------------------------------------------------------------------------
ఈ-శ్రమ్ నమోదు: 2021 ఆగస్టులో ప్రారంభమైన ఈ పథకం
16నుంచి59 ఏళ్ల వయస్సు ఉండి అసంఘటిత రంగంలో ఉన్న శ్రమజీవులందరూ ఈ-శ్రమ్‌లో నమోదు చేసుకోవడానికి అర్హులు. నమోదైన కార్మికులకు 12 అంకెల ప్రత్యేక యూనివర్సల్ ఐడెంటీఫికేషన్ నంబర్‌తో కేంద్రప్రభుత్వం గుర్తింపు కార్డును అందిస్తోంది. నమోదు చేసుకున్న ప్రతీ కార్మికుడికి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కార్మికులు మరణిస్తే రెండు లక్షల రూపాయల బీమా లభిస్తుంది. శాశ్వత వైకల్యం ఏర్పడితే లక్ష రూపాయల ప్రమాద బీమా పొందుతారు. దీంతో పాటు కార్మికులకు కేంద్ర ప్రభుత్వం కల్పించే వివిధ పథకాలకు ప్రాధాన్యం కూడా కల్పిస్తారు. వ్యవసాయ కూలీలు, అడ్డా కూలీలు, మత్స్యకారులు, భవన నిర్మాణ రంగాల్లో పనిచేసే కార్మికులు వడ్డెరలు, సెంట్రింగ్, ఫ్లంబింగ్, శానిటరీ, పేయింటింగ్, ఎలక్ర్టీషీయన్, వెల్డింగ్, ఇటుక బట్టీ, పవర్‌లూం, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు ఉపాధిహామీ కూలీలు, అంగన్‌వాడీలు, అశావర్కర్లు, అటో డ్రైవర్లు, కూరగాయలు, పండ్లు అమ్ముకునే వ్యాపారులు, టైలరింగ్, స్వర్ణకారులు, బ్యూటీ పార్లర్‌లలో పనిచేసే కార్మికులతో పాటు కొరియర్ బాయ్స్, విద్యావలంటీర్లు అందరూ ఈ పథకానికి అర్హులే. ఈపీఎఫ్, ఈఎస్‌ఐలో లేని వారందరూ ఈ-శ్రమ్‌లో నమోదు చేసుకోని సౌకర్యాలు పొందే వీలు ఉంది.
అంతర్జాతీయ అర్చరీ పోటీల్లో భారతదేశం తరపున పాల్గొనటానికి ఎంపికైన ఎలిగేడు మండలం సుల్తానాపూర్ గ్రామానికి చెందిన తానిపర్తి చికితను గురువారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో కలెక్టర్ డాక్టర్ సంగీతసత్యనారాయణ అభినందించారు.
1. వసతుల విస్తరణే వికాస మంత్రం
అభివృద్ధికి మౌలిక వసతులే పునాది రాళ్లు. మెరుగైన మౌలిక సౌకర్యాలతో స్వదేశీ, విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుంది. ఆర్థిక కార్యకలాపాలు విస్తృతమవుతాయి. ఉపాధి అవకాశాలు అధికమవుతాయి. సమగ్ర ఆర్థికాభివృద్ధికి బాటలు పడతాయి. ఈ పరిణామాలన్నీ దేశార్థికానికి మేలు చేస్తాయి.
సామ్యవాదం, పెట్టుబడిదారీ విధానాల కలయికగా స్వతంత్ర భారతం మిశ్రమ ఆర్థిక వ్యవస్థను చేపట్టింది. కొన్ని దశాబ్దాలపాటు మౌలిక వసతుల విస్తరణపై దృష్టి కేంద్రీకరించింది. జవహర్‌లాల్ నెహ్రూ హయాములో ఆధునిక ఆలయాల వంటి బహుళార్థ సాధక నీటిపారుదల ప్రాజెక్టులు, ఉక్కు కర్మాగారాలు, విద్యుత్కేంద్రాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, శాస్త్రసాంకేతిక పరిశోధన సంస్థలు విరివిగా ఏర్పాటయ్యాయి. 1991లో సోవియట్ విచ్ఛిన్నంతో భారత ఆర్థిక వ్యవస్థ కూడా సామ్యవాద పంథాను విడనాడాల్సి వచ్చింది. పీవీ నరసింహారావు హయాములో చేపట్టిన ఆర్థిక, పారిశ్రామిక సంస్కరణలు భారత్‌లో ప్రైవేట్ రంగానికి ఊతమిచ్చాయి. తరవాత యూపీఏ ప్రభుత్వాలు మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి సంక్షేమ విధానాలకూ ప్రాధాన్యం ఇచ్చాయి. 2014లో నరేంద్ర మోదీ నాయకత్వంలో ఏర్పడిన ఎన్‌డీఏ ప్రభుత్వం సమ్మిళిత అభివృద్ధి, మౌలిక వసతులను జోడు గుర్రాలుగా అభివృద్ధి రథాన్ని ముందుకు ఉరికించాలని నిశ్చయించింది. మోదీ రెండోసారి పగ్గాలు చేపట్టినప్పుడు కొవిడ్ మహమ్మారి వచ్చిపడటంతో ప్రాథమ్యక్రమాన్ని సవరించుకోక తప్పలేదు. 2020లో కొవిడ్ దెబ్బ నుంచి ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడంపైనా, 2021లో ఆర్థికంగా తిరిగి కోలుకోవడంపైనా శక్తియుక్తులన్నీ కేంద్రీకరించాల్సి వచ్చింది. ఇప్పుడు కొవిడ్ ముప్పు నుంచి బయటపడినందు వల్ల- 2023 కేంద్ర బడ్జెట్ మళ్ళీ మౌలిక వసతుల విస్తరణకు అగ్రాసనం వేసింది. 2019-20 కన్నా ఈసారి పెట్టుబడి వ్యయాన్ని మూడింతలు (రూ.10 లక్షల కోట్లకు) పెంచడం ఇక్కడ గమనార్హం. మౌలిక వసతుల ప్రాజెక్టుల వ్యయంలో 20 నుంచి 25 శాతం రాష్ట్రాల చేతుల మీదుగానే జరుగుతోంది. అందుకే రాష్ట్రాల్లో కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులకు 50 ఏళ్లపాటు వడ్డీలేని రుణాలు ఇస్తామని బడ్జెట్ ప్రకటించింది. ఈ ప్రత్యేక రుణ పథకానికి 2023-24 బడ్జెట్‌లో రూ.1,30,000 కోట్లు కేటాయించారు. 2022-23లో ఈ పథకానికి కేటాయింపులు రూ.76,000 కోట్లే.
రవాణా, హరిత ఇంధనాలకు పెద్దపీట
పటిష్ఠ మౌలిక వసతుల పునాదిపైనే ప్రపంచంలో రెండో పెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా ఆవిర్భవించింది. భారత్ త్వరలోనే మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని అంచనా. ప్రస్తుతం అమెరికా, ఐరోపాలకు చైనాపై విముఖత ఏర్పడినందువల్ల ఆ దేశాల నుంచి పెద్దయెత్తున పెట్టుబడులను ఆకర్షించడానికి ఇదే సరైన అదను. రేవులు, రహదారులు, విద్యుత్ సరఫరా వంటి మౌలిక వసతులు పటిష్ఠంగా ఉంటేనే విదేశీ పెట్టుబడులు భారత్ వైపు మొగ్గు చూపుతాయి. దేశంలోని ప్రైవేట్ కంపెనీలూ ఉత్సాహంగా పెట్టుబడులు పెడతాయి. కొత్త బడ్జెట్ ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని తగిన చర్యలు ప్రతిపాదించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో విమాన, నౌకా రవాణా, జల మార్గాలు, కమ్యూనికేషన్లు, విద్యుత్కేంద్రాలు, హరిత ఇంధనాలు, పట్టణాభివృద్ధి, గృహవసతి, రేవులు, రైల్వే వంటి మౌలిక వసతులకు కేటాయింపులను బాగా పెంచారు. ఈ కేటాయింపులు మొత్తం పెట్టుబడి వ్యయంలో 16.6 శాతంగా లెక్కతేలతాయి. రోడ్డు రవాణాను పటిష్ఠం చేయడానికి రూ.75,000 కోట్ల వ్యయంతో 100 రవాణా మౌలిక వసతుల విస్తరణ ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు నిర్మల ప్రకటించారు. రోడ్డు రవాణా శాఖకు నిరుటికన్నా 36 శాతం ఎక్కువ నిధులు కేటాయించారు. 25,000 కిలోమీటర్ల మేరకు రహదారులను అభివృద్ధి చేయాలని 2022-23 బడ్జెట్‌లో ప్రకటించిన లక్ష్యాన్ని అందుకోవడానికి ఈ కేటాయింపులు తోడ్పడతాయి. ప్రపంచ పౌర విమానయాన విపణిలో భారత్ ఇప్పటికే మూడో స్థానం ఆక్రమిస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య అనుసంధానతను విస్తరించడానికి కొత్తగా 50 విమానాశ్రయాలు నిర్మిస్తామని ఆర్థిక మంత్రి వెల్లడించారు. 2030కల్లా ఏటా 50లక్షల మెట్రిక్ టన్నుల హరిత ఉదజనిని ఉత్పత్తి చేయాలని కేంద్రం లక్షించింది. శిలాజ ఇంధనాల నుంచి హరిత ఇంధనాలకు మారడానికి కొత్త బడ్జెట్‌లో రూ.35,000 కోట్లు కేటాయించింది. హరిత ఇంధనాల ఉత్పత్తికి పలు ప్రైవేటు సంస్థలు ఇప్పటికే భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. ఉదాహరణకు ఎస్సార్ గ్రూపు ఉదజని ప్రాజెక్టులలో రూ.50,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంది. అదానీ, రిలయన్స్ సంస్థలు కూడా వేల కోట్ల రూపాయలతో హరిత ఇంధన ప్రాజెక్టులు చేపడుతున్నాయి. బడ్జెట్ ప్రతిపాదనలు ఆ సంస్థల్లో ఉత్సాహం నింపుతున్నాయి.
ఉపాధి కల్పనకు ఊతం
మౌలిక వసతుల విస్తరణ ప్రాజెక్టులను చేపట్టే ప్రైవేటు సంస్థలకు రుణాలు అందించడానికి కేంద్రం ప్రత్యేక సంస్థను నెలకొల్పింది. దాన్ని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ సెక్రటేరియట్‌గా వ్యవహరిస్తున్నారు. రెండో, మూడో అంచె నగరాల్లో మౌలిక వసతుల విస్తరణకు కూడా ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి నిధిగా నామకరణం చేసిన ఈ సంస్థకు ఏటా రూ.10,000 కోట్లు ప్రత్యేకించనుంది. గత బడ్జెట్ దేశ జీడీపీలో 2.15 శాతాన్ని మౌలిక వసతులకు కేటాయించగా, 2023 బడ్జెట్ 2.5 శాతాన్ని కేటాయించింది. ఇలాంటి ప్రాజెక్టులపై పెట్టుబడి వ్యయం కింద వెచ్చించే ప్రతి రూపాయి అదే సంవత్సరంలో రూ.2.45 పైసల లబ్ధి చేకూరుస్తుంది. తదుపరి సంవత్సరాలలో రూ.3.14 పైసల లబ్ధిని అందిస్తుంది. తాజా బడ్జెట్‌లో పెరిగిన పెట్టుబడి వ్యయం ఆర్థికాభివృద్ధికి, తద్వారా ఉపాధి కల్పనకు ఊతమిస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది.
---------------------------------------------------------------------------------------------------
2. కళతప్పిన ఉన్నత విద్య
నిపుణులైన మానవ వనరులను సృష్టించడంలో ఉన్నత విద్యది కీలక పాత్ర. ఇండియాలో నేటికీ చాలా ఉన్నత విద్యాసంస్థలు జాతీయ మదింపు, గుర్తింపు మండలి (న్యాక్) జాబితాలోకి ఎక్కలేదు. సరైన మౌలిక వసతులు, నిపుణులైన అధ్యాపకులు కొరవడి దేశీయంగా ఉన్నత విద్య ఈసురోమంటోంది.
భారత్‌లోని అన్ని ఉన్నత విద్యా సంస్థలూ వచ్చే పదిహేనేళ్లలో జాతీయ మదింపు, గుర్తింపు మండలి (న్యాక్) జాబితాలో చేరడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని జాతీయ నూతన విద్యావిధానం సూచించింది. దానికోసం అవి వ్యవస్థాగత అభివృద్ధి ప్రణాళికలను చురుకెత్తించాలని పిలుపిచ్చింది. అయితే, భారత్‌లో కనీసం 695 విశ్వవిద్యాలయాలు, ముప్ఫై నాలుగు వేలకు పైగా కళాశాలలకు నేటికీ న్యాక్ గుర్తింపు లేదు. ఈ మేరకు పార్లమెంటులో కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ ఇటీవల ప్రకటించారు. విశ్వవిద్యాలయ నిధుల సంఘం (యూజీసీ) లెక్కల ప్రకారం దేశీయంగా 1,113 వర్సిటీలు, 43,796 కళాశాలలు ఉన్నాయి.
నిరుద్యోగుల ఉత్పత్తి కేంద్రాలు
పాఠ్యాంశాలు, బోధన-అభ్యసన, మూల్యాంకనం, పరిశోధన, మౌలిక వసతులు, విద్యార్థుల పురోభివృద్ధి, పాలన, నాయకత్వం, నిర్వహణ, సంస్థాగత విలువలు, అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులు వంటి అంశాల ఆధారంగా ఉన్నత విద్యాసంస్థల పనితీరును న్యాక్ మదింపు వేస్తుంది. ఆ మేరకు ఏ ప్లస్‌ప్లస్ నుంచి డి దాకా గ్రేడ్లు ఇస్తుంది. ‘డి’ గ్రేడ్ లభిస్తే ఆ సంస్థ న్యాక్ గుర్తింపునకు అనర్హమైందని అర్థం. న్యాక్ గుర్తింపు వల్ల ఒక విద్యాసంస్థ బలాలు, బలహీనతలు తెలుస్తాయి. దాని ఆధారంగా బలహీనంగా ఉన్న అంశాలపై మరింత దృష్టి సారించడానికి అవకాశం దక్కుతుంది. న్యాక్ గ్రేడ్ వల్ల సంస్థకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. అయితే, న్యాక్ గుర్తింపు కోసం దరఖాస్తు ప్రక్రియ సుదీర్ఘమైందన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ తరుణంలో దరఖాస్తు విధానాన్ని సరళతరం చేసినట్లు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ ఇటీవల ప్రకటించారు. అన్ని కాలేజీలను న్యాక్ వ్యవస్థలోకి తెచ్చేందుకు మదింపు, గుర్తింపు రుసుములను తగ్గించినట్లూ ఆయన వెల్లడించారు. అయితే, నాణ్యతా ప్రమాణాల లేమి బయటపడుతుందనే భయంతో దేశీయంగా 22శాతం కళాశాలలు న్యాక్ గుర్తింపు కోసం ప్రయత్నించడం లేదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దేశీయంగా గ్రామీణ ప్రాంతాల్లోని చాలా కాలేజీల్లో నేటికీ సరైన మౌలిక వసతులు లేవు. నిపుణులైన అధ్యాపకులూ కొరవడ్డారు. చాలా రాష్ట్రాల్లో విశ్వవిద్యాలయాలకు సరైన పాలక మండళ్లు సైతం లేని దుస్థితి నెలకొంది. కొన్నిచోట్ల పూర్తిస్థాయి ఉపకులపతుల పదవులూ ఖాళీగా ఉంటున్నాయి. ప్రభుత్వాల నుంచి నిధులు ఆగిపోవడంతో కొన్ని వర్సిటీలు ఆర్థిక ఇక్కట్లతో కొట్టుమిట్టాడుతున్నాయి. అధ్యాపక నియామకాలు, మౌలిక వసతుల కల్పన, నిధుల విడుదలలో నిర్లక్ష్యం కారణంగా ఇండియాలో 90శాతం కళాశాలలు, 70శాతం విశ్వవిద్యాలయాలు నాణ్యత లేని విద్యకు నెలవులుగా, నిరుద్యోగుల ఉత్పత్తి కేంద్రాలుగా మారాయని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశీయంగా న్యాక్ గుర్తింపునకే నోచుకోలేకపోతున్న కళాశాలలు అంతర్జాతీయ స్థాయిలో ఎలా పోటీపడతాయని వారు ప్రశ్నిస్తున్నారు.
నిపుణులైన అధ్యాపకులు కీలకం
మరోవైపు దేశీయంగా పెద్దసంఖ్యలో ఉన్నత విద్యాసంస్థలకు న్యాక్ గుర్తింపు ఉన్నా, అంతర్జాతీయ స్థాయి పోటీలో వాటి స్థానం ఎక్కడన్న ప్రశ్న ఎదురవుతోంది. ఈ క్రమంలో న్యాక్ గుర్తింపు వల్ల పెద్దగా ఒరిగేదేమిటని పలువురు పెదవి విరుస్తున్నారు. న్యాక్ గ్రేడ్ల కేటాయింపు విషయంలోనూ విమర్శలు ఎదురవుతున్నాయి. ప్రైవేటు కళాశాలలు న్యాక్ గుర్తింపు కోసం అవకతవకలకు పాల్పడుతున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో న్యాక్ గ్రేడ్లు, ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగుల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, నాణ్యమైన విద్యకు అవి మాత్రమే గీటురాళ్లు కాదని న్యాక్ మాజీ ఛైర్మన్ హెచ్.దేవరాజ్ గతంలో ఒక సదస్సులో వ్యాఖ్యానించారు. దేశంలో తాను ఏ విద్యాసంస్థకు వెళ్ళినా అక్కడ ఇటీవల ఏర్పాటుచేసిన ఏసీ గదులు, ఆధునిక సాంకేతిక హంగులు వంటి వాటినే చూపిస్తున్నారని, నిపుణులైన అధ్యాపకుల గురించి చెప్పడం లేదని ఆయన విమర్శించారు. దేశీయంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఐఐఎంలలోనే పదకొండు వేలకు పైగా అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నత విద్యారంగంలో మెరుగైన ఫలితాలు ఆశించడం అత్యాశే అవుతుంది. ఈ దుస్థితిని పరిమార్చాలంటే అన్ని వర్సిటీలు, ప్రభుత్వ కళాశాలల్లో ఖాళీ పోస్టులను వెంటనే నిపుణులైన అధ్యాపకులతో భర్తీ చేయాలి. రాష్ట్రస్థాయి వర్సిటీలు, ఇతర ప్రభుత్వ కళాశాలల్లో కనీస వసతుల మెరుగుదలపై పాలకులు దృష్టి కేంద్రీకరించాలి. ప్రైవేటు కళాశాలలు సైతం అనుభవజ్ఞులైన అధ్యాపకులను నియమించుకొనేలా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించడం తప్పనిసరి. - ఎం.వి.బాబు
------------------------------------------------------------------------------------------------------------------
3. భూగర్భ జలాలకూ కాలుష్యం కాటు
దీర్ఘకాలికంగా తాగునీటి సరఫరాకు భూగర్భ జలమే సురక్షితమైన వనరుగా భావిస్తున్నారు. అయితే, భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా భూగర్భ జలాలు రకరకాల కాలుష్య కారకాల ప్రభావానికి లోనవుతున్నాయి. ఇలాంటి కాలుష్య కారకాల్లో యురేనియం కూడా ఉంటున్నట్లు తాజాగా గుర్తించడం ఆందోళనకర పరిణామం. ఇది ప్రజల ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
సాధారణంగా లోతైన బావుల భూగర్భ జలాల్లోనే యురేనియం ఎక్కువ పరిమాణంలో ఉంటున్నట్లు తేలింది. అంటే, యురేనియాన్ని కలిగి ఉండే భూగర్భ శిలలే భూగర్భ జలాల కాలుష్యానికి ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. బొగ్గు, ఫాస్ఫేట్, చమురు, గ్యాస్, యురేనియం తదితర తవ్వకాల ప్రక్రియ, సంప్రదాయ యురేనియం వెలికితీత ప్రక్రియలో వ్యర్థాలను విచ్చలవిడిగా పారవేయడం, సైనిక కార్యకలాపాలు, వ్యవసాయ రంగంలో ఫాస్ఫేట్ ఎరువులు, అధికంగా నైట్రేట్ ఉపయోగించడం, భూగర్భ జలమట్టాలు తగ్గడం వంటివి యురేనియం కదలికలకు కారణమై గాలి, మృత్తిక, నీటి కాలుష్యానికి దారి తీస్తున్నాయి. భారతదేశంలోని భూగర్భ జలాలు యురేనియంతో ఎక్కువగా కలుషితం అవుతున్నాయని కేంద్ర భూగర్భ జలసంస్థ తాజా అధ్యయనంలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా సేకరించిన భూగర్భ జల నమూనాల రసాయనిక విశ్లేషణ ప్రకారం యురేనియం స్థాయులు లీటర్ నీటిలో సున్నా నుంచి 532 మైక్రోగ్రాముల వరకు ఉన్నట్లు వెల్లడెంది. భారతీయ తాగునీటి ప్రమాణాల సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థల అధ్యయనాల ప్రకారం- లీటర్ తాగునీటిలో 30 మైక్రోగ్రాములకు మించి యురేనియం సాంద్రత ఉండకూడదు. సాధారణంగా మనం తీసుకునే ఆహారంలోనే ఎంతోకొంత యురేనియం కచ్చితంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతుంటారు. అది నీటి ద్వారా మానవ శరీరం నుంచి బయటకు వెళ్ళిపోతుంది. స్వల్ప పరిమాణంలో మాత్రమే జీర్ణవ్యవస్థ గ్రహిస్తుంది. యురేనియం అధిక మోతాదులో శరీరంలో మిగిలిపోతే మూత్రపిండాల వైఫల్యానికి, ఎముకల్లో సాంద్రత తగ్గడానికి, క్యాన్సర్, డీఎన్‌ఏకు హానికలగడం తదితర ప్రతికూల ప్రభావాలకు దారితీస్తుంది.
కేంద్ర భూగర్భ జలసంస్థ చేపట్టిన 2018-19 నాటి నీటి నాణ్యత పరిశీలనతో పోల్చితే 2021-22 పరిశీలనలో చాలా రాష్ట్రాల్లోని భూగర్భ జలాల్లో యురేనియం కాలుష్యం పెరిగింది. పంజాబ్ (29 శాతం), హరియాణా (14.4 శాతం) భూగర్భ జలాల్లో యురేనియం నిర్దేశిత తాగునీటి పరిమితికి మించి ఉన్నట్లు తేలింది. ఇందులో ఈ రెండు రాష్ట్రాలు దేశంలోనే మొదటి, రెండో స్థానాల్లో నిలిచాయి. ఉత్తర్ ప్రదేశ్ (9.2 శాతం), రాజస్థాన్ (8.6 శాతం), దిల్లీ (3.9 శాతం), తమిళనాడు (3.4 శాతం), తెలంగాణ (1.43 శాతం), మధ్యప్రదేశ్ (1.3శాతం), ఒడిశా (0.69 శాతం), బిహార్ (0.36 శాతం), ఛత్తీస్‌గఢ్ (0.12 శాతం) రాష్ట్రాలు తరవాతి స్థానాల్లో ఉన్నాయి. మధ్యప్రదేశ్, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, ఒడిశా, తెలంగాణ, బిహార్ వంటి ఏడు రాష్ట్రాల్లో స్థానికంగా కొన్ని ప్రాంతాల్లోని భూగర్భ జలాల్లోనే యురేనియం సాంద్రత నిర్దేశిత పరిమితికి మించి ఉన్నట్లు వెల్లడైంది. 13 రాష్ట్రాల్లో సురక్షిత పరిమితుల్లోనే ఉంది. యురేనియం నిక్షేపాలు లేని ప్రదేశాల్లో సైతం భూగర్భ జలాలు కాలుష్యానికి గురవుతున్నాయి.
యురేనియం కాలుష్యాన్ని పర్యవేక్షించడానికి శాస్త్రవేత్తలు సులభమైన పద్ధతిని ప్రతిపాదించారు. దీనిప్రకారం లీటర్ నీటిలో బైకార్బోనేట్ సాంద్రత 410 మిల్లీగ్రాములు కంటే ఎక్కువగా ఉన్నచోట్ల తాగునీటిలో యురేనియం ప్రభావం ఉన్నట్లుగా గుర్తించవచ్చు. ఇలాంటి రసాయనిక పరీక్షలు కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనశాలల్లో సులభంగా చేపట్టవచ్చు. ఖర్చు కూడా చాలా తక్కువవుతుంది. అందుకని అనుమానిత ప్రదేశాల్లో తాగునీటిలో యురేనియం ఉనికిని గుర్తించేందుకు క్రమం తప్పకుండా రసాయనిక పరీక్షలను అందరూ చేయించుకోవచ్చు. ఇలాంటి పరీక్షలను ఉచితంగా చేపట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగాలు మొబైల్ వ్యాన్ల ద్వారా ఏర్పాట్లు చేయాలి. కొన్నిరకాల నీటిశుద్ధి ప్రక్రియల ద్వారా శాస్త్రీయ పద్ధతుల్లో నీటిలో యురేనియం సాంద్రతను తగ్గించవచ్చు. అన్నింటికంటే సులభమైనదీ, అందరూ ఆచరించేందుకు వీలయ్యే పద్ధతి వర్షపు నీటిని నిల్వ చేయడమే. ఈ పద్ధతులు నీటిలో కరిగి ఉన్న అధిక సాంద్రతతో కూడిన అయాన్లను తేలికగా పలుచబార్చి తాగడానికి అనుకూలంగా మారుస్తాయి.
--------------------------------------------------------------------------------------------------------------------
4. Putin and Belarus | 2030 నాటికి బెలారస్ ఆక్రమణ.. రష్యా కుట్రను భగ్నం చేసిన డాక్యుమెంట్స్
Putin and Belarus | ఉక్రెయిన్ (Ukraine) పై దాడులు కొనసాగిస్తున్న రష్యా (Russia).. 2030 నాటికి బెలారస్ (Belarus) దేశాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నది. ఇది రష్యాకు పొరుగున ఉన్న దేశమే కాకుండా స్నేహపూర్వకమైనది కూడా. ఈ విషయాలను కొన్ని లీకైన డాక్యుమెంట్లు (leaked documents) వెల్లడిస్తున్నాయి. ఈ డాక్యుమెంట్ల ఆధారంగా ఉక్రెయిన్‌కు చెందిన అతిపెద్ద వార్తాపత్రిక ‘కీవ్ ఇండిపెండెంట్’ (Kiev Independent) ఒక కథనాన్ని ప్రచురించింది. డాక్యుమెంట్లను మాత్రం ప్రచురించలేదు.
పాశ్చాత్య ఇంటెలిజెన్స్ సోర్స్ (Western intelligence source) ప్రకారం, అనేక రష్యన్ ఏజెన్సీలు సంయుక్తంగా ఈ రెండు భాగాల ప్రణాళికలను సిద్ధం చేశాయి. మొదటి భాగం – 2022 నుంచి 2025 వరకు, రెండవది 2025 నుంచి 2030 వరకు అమలు చేయనున్నారు. ఇది రష్యా దేశీయ, విదేశీ, మిలిటరీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలచే తయారు చేయబడినట్లుగా పేర్కొంటున్నారు. ఈ డాక్యుమెంట్స్ 2021 లో తయారుచేసినట్లుగా భావిస్తున్నారు.
కీవ్ ఇండిపెండెంట్ కథనం ప్రకారం, ఒకవైపు వ్లాదిమిర్ పుతిన్ ప్రభుత్వం ఉక్రెయిన్‌ను ఆక్రమించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. మరోవైపు బెలారస్ పట్ల రష్యా ఏమాత్రం చిత్తశుద్ధి చూపడం లేదు. బెలారస్ ప్రభుత్వం, ఆ దేశ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో (Alexander Lukashenko) ఉక్రెయిన్‌పై యుద్ధంలో పుతిన్‌కు సాధ్యమైన విధంగా సహాయం చేస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ బెలారస్‌ను స్నేహపూర్వక దేశంగానే భావిస్తూ ఆ దేశాన్ని హస్తగతం చేసుకునేందుకు పుతిన్ కుట్రపన్నాడు.
బెలారస్‌ను ఆక్రమించుకునేందుకు రష్యా వేసిన ప్లాన్‌కు సంబంధించిన వివరాలు ఈ డాక్యుమెంట్లలో ఉన్నట్లు కీవ్ ఇండిపెండెంట్ తన కథనంలో తెలిపింది. బెలారస్ రాజకీయ, ఆర్థిక, సైనికాంశాల్లో రష్యా ఎలా ఆధిపత్యం చెలాయిస్తుందో ఆ పత్రాల్లో సవివరంగా ఉన్నది. ఏడేండ్లల్లో అంటే 2030 నాటికి బెలారస్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవడమే రష్యా ఉద్దేశంగా కనిపిస్తున్నది. 2030 నాటికి రష్యాలో ప్రస్తుతమున్న కరెన్సీ, పన్ను విధానాన్ని బెలారస్‌లో తీసుకురావాలని రష్యా కోరుకుంటున్నట్లు డాక్యుమెంట్లలో పేర్కొన్నారు. అలాగే, మీడియాపై కూడా నియంత్రణ కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలని, రష్యా సైన్యం అనుసరించే నిబంధనలనే బెలారస్ సైన్యం పాటించాలని కూడా వెల్లడించింది. ఇవే కాకుండా బెలారస్‌కు చెందిన అన్ని ప్రధాన సైనిక కార్యాలయాలు రష్యాకు మార్చేలా చర్యలుండాలని పుతిన్ ప్రభుత్వం ఆ పత్రాల్లో స్పష్టం తెలిపింది.
22 Feb 2023
----------------------------------------------------------------------------------------------------------------------
5. India China Talks | సరిహద్దు సమస్యపై భారత్, చైనా చర్చలు.. బీజింగ్‌లో తొలిసారి మీటింగ్
India China Talks| బీజింగ్‌లో బుధవారం తొలిసారి ఇరు దేశాల ప్రతినిధులు వ్యక్తిగతంగా సమావేశమై సరిహద్దు సమస్యలపై చర్చించారు. ఎల్‌ఏసీ పశ్చిమ సెక్టార్‌తోపాటు మిగిలిన ప్రాంతాలలో బలగాల ఉపసంహరణను నిర్మాణాత్మక పద్ధతిలో కొనసాగించాలని ప్రతిపాదించారు.
న్యూఢిల్లీ: సరిహద్దు సమస్యపై భారత్, చైనా (India China Talks) మధ్య మరోసారి చర్చలు జరిపాయి. వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి కొనసాగుతున్న ప్రతిష్టంభనపై మాట్లాడుకున్నాయి. అయితే సరిహద్దులో మోహరించిన సైనిక దళాల ఉపసంహరణతోనే ద్వైపాక్షిక సంబంధాల సాధారణ స్థితి పునరుద్ధరణకు వీలు కలుగుతుందని భారత్ స్పష్టం చేసింది. కాగా, చైనా రాజధాని బీజింగ్‌లో తొలిసారి ఈ సమావేశం జరుగడం విశేషం. భారత్, చైనా సరిహద్దు వ్యవహారాలపై వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ (డబ్ల్యూఎంసీసీ) ఆధ్వర్యంలో ఈ చర్చలు జరిగాయి. 2019 జూలై తర్వాత ఇరు దేశాల మధ్య 14వ సమావేశం బుధవారం జరిగింది. అయితే దీని ఆధ్వర్యంలో ఇరు దేశాల మధ్య జరిగిన తొలి వ్యక్తిగత సమావేశం కూడా ఇదే కావడం మరో విశేషం.
భారత్, చైనా సరిహద్దులో ఉద్రిక్తతల నివారణకు 2020 మేలో డబ్ల్యూఎంసీసీ ఏర్పాటైంది. కరోనా వల్ల ఇప్పటి వరకు వర్చువల్‌గా మాత్రమే సమావేశాలు జరిగాయి. అయితే బీజింగ్‌లో బుధవారం తొలిసారి ఇరు దేశాల ప్రతినిధులు వ్యక్తిగతంగా సమావేశమై సరిహద్దు సమస్యలపై చర్చించారు. ఎల్‌ఏసీ పశ్చిమ సెక్టార్‌తోపాటు మిగిలిన ప్రాంతాలలో బలగాల ఉపసంహరణను నిర్మాణాత్మక పద్ధతిలో కొనసాగించాలని ప్రతిపాదించారు. దీని కోసం త్వరలో సీనియర్ కమాండర్ల 18వ రౌండ్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.
మరోవైపు సైనిక, దౌత్య మార్గాల ద్వారా చర్చలు కొనసాగించేందుకు భారత్, చైనా అంగీకరించాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. బీజింగ్‌లో జరిగిన డబ్ల్యుఎంసీసీ తొలి వ్యక్తిగత సమావేశంలో భారత్ బృందం తరుఫున విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి (తూర్పు ఆసియా) నేతృత్వం వహించినట్లు పేర్కొంది. చైనా బృందానికి ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన సరిహద్దు, సముద్ర వ్యవహారాల విభాగం డైరెక్టర్ జనరల్ నాయకత్వం వహించినట్లు వెల్లడించింది.
------------------------------------------------------------------------------------------------------------------
6. ‘ట్విన్ టవర్స్’కు బీటలు!
2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీ, అనంతరం ఆ మీడియా సంస్థపై ఐటీ దాడులు, అదానీ గ్రూప్ కంపెనీల్లో అవకతవకలు జరిగాయంటూ హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదిక.. వెరసి దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీ, అనంతరం ఆ మీడియా సంస్థపై ఐటీ దాడులు, అదానీ గ్రూప్ కంపెనీల్లో అవకతవకలు జరిగాయంటూ హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదిక.. వెరసి దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ అంశాలపై నోరు విప్పాలని కేంద్రంలోని బీజేపీ సర్కారును బీఆర్‌ఎస్ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్ అల్లర్లు, మోదీ హయాంలో అదానీ సామ్రాజ్యం విస్తరించిన తీరు, బీబీసీపై దాడుల వంటి పలు కీలక అంశాలపై ప్రసిద్ధ రచయిత్రి, బుకర్ ప్రైజ్ గ్రహీత అరుంధతీ రాయ్ ప్రఖ్యాత పత్రిక ‘ది గార్డియన్’లో ప్రత్యేక వ్యాసాన్ని రాశారు.
ప్రధాని మోదీ, వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ‘ట్విన్ టవర్స్’ లాంటి వారు. ప్రస్తుత ఘటనలు వారికి పెద్ద దెబ్బే. మోదీ, అదానీ ఎదుగుదలకు ఒకరినొకరు సాయం చేసుకున్నారు. ప్రస్తుత పరిణామాలతో వారి బంధంపై నీలినీడలు కమ్ముకున్నాయి. దేశంలో నెలకొన్న హింసాత్మక హిందూ జాతీయవాదాన్ని బడా కార్పొరేట్లు లిఖించారని, ఎట్టకేలకు మోదీ మాడల్ అంటే ఏమిటో అందరికీ తెలుసొచ్చింది.
గుజరాత్ మారణకాండకు మోదీనే బాధ్యుడంటూ బీబీసీ చిత్రీకరించిన డాక్యుమెంటరీ, అదానీ గ్రూప్ కంపెనీల్లో ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ హిండె న్‌బర్గ్ ఇచ్చిన నివేదిక.. భారత్‌పై జరిగిన దాడిగా ఓ వర్గం భారత మీడియా ప్రసారం చేస్తున్నది. అయితే, అది నిజం కాదు. తాజా ఘటనలతో ఈ ట్విన్ టవర్స్‌కు బీటలు వారాయనే చెప్పాలి.
2003లో ‘వైబ్రెంట్ గుజరాత్’ పేరిట ఓ పెట్టుబడుల సదస్సు జరిగింది. ‘గుజరాత్ నమూనా అభివృద్ధి’ అంటూ మోదీ ఇప్పుడు చేసుకుంటున్న ప్రచారానికి అదే మూలం. అయితే, కార్పొరేట్ల డబ్బుతో హింసాత్మక హిందూ జాతీయవాదమనేది రాయడం అప్పుడే మొదలైంది. ఏదైతేనేం, మోదీ మాడల్ ఏమిటో చివరికి తెలిసొచ్చింది.
మోదీ, అదానీ మధ్య బంధం ఇప్పటిది కాదు. కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్నది. 2002లో గుజరాత్‌లో ముస్లింల ఊచకోత జరగడానికి కొన్ని నెలల ముందే నరేంద్ర మోదీ ఆ రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దాదాపుగా ఇదే సమయం లో మోదీ-అదానీ మధ్య మైత్రీబంధం మరింత పెనవేసుకొన్నది. 2003లో ‘వైబ్రెంట్ గుజరాత్’ పేరిట ఓ పెట్టుబడుల సదస్సు జరిగింది. ‘గుజరాత్ నమూనా అభివృద్ధి’ అంటూ మోదీ ఇప్పుడు చేసుకుంటున్న ప్రచారానికి అదే మూలం. అయితే, కార్పొరేట్ల డబ్బు తో హింసాత్మక హిందూ జాతీయవాదమనేది రాయ డం అప్పుడే మొదలైంది. ఏదైతేనేం, మోదీ మాడల్ ఏమిటో చివరకు తెలిసొచ్చింది.
2014లో మోదీ ప్రధాని అయ్యారు. అదానీ కంపెనీల ఎయిర్‌క్రాఫ్ట్‌లో తిరిగారు. మోదీ తొమ్మిదేండ్ల పాలనలో 800 కోట్ల డాలర్లుగా ఉన్న అదానీ సంపద ఏకంగా 13,700 కోట్ల డాలర్లకు ఎగబాకింది. 2022 ఏడాదిలోనే 7,200 కోట్ల డాలర్ల సంపదను అదానీ అర్జించారు. ప్రపంచంలోని తొమ్మిది మంది కుబేరుల ఆ ఏడాది సంపాదన కంటే ఇది ఎక్కువ. దేశంలోని 30 శాతం పోర్టులు, 23 శాతం ఎయిర్‌పోర్టులు, 30 శాతం గిడ్డంగులు, ప్రైవేట్‌రంగంలో అతిపెద్ద పవర్‌ప్లాంట్ అదానీ గ్రూప్ సొంతం. గుజరాత్ అభివృద్ధి నమూనా ఇలా సాకారమైంది. తొలుత అదానీ విమానాల్లో నరేంద్ర మోదీ ప్రయాణించారు. ప్రస్తుతం, మోదీ విమానాల్లో అదానీ ప్రయాణిస్తున్నారు. (దేశంలోని ప్రధాన విమానాశ్రయాలన్నీ అదానీ గ్రూప్‌నకే కట్టబెట్టడాన్ని ఉద్దేశిస్తూ..) అయితే, ఇప్పుడు ఆ రెండు విమానాల ఇంజిన్‌లో ట్రబుల్ ఏర్పడింది. జాతీయవాదం పేరిట భారత జెండాను ఒంటికి చుట్టుకొన్నంత మాత్రాన వాళ్లిద్దరూ ఆ సమస్య నుంచి బయటపడగలరా? అనేది అనుమానమే. గుజరాత్ అల్లర్లకు సంబంధించి బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీలో ఎన్నో విషయాలున్నాయి. బాధితులు తమ గోడు చెప్పుకొన్నారు. ఆ డాక్యుమెంటరీలో నేనూ భాగమయ్యా. అయితే, ఈ వీడియోను భారతీయులు వీక్షించకుండా ఆయా లింక్స్‌ను యూ ట్యూబ్, ట్విట్టర్ మాధ్యమాల నుంచి ప్రభుత్వం తొలగించింది. వర్సిటీల్లో స్క్రీనింగ్ ఏర్పాటుచేసిన వారిపై, వీక్షిస్తున్న విద్యార్థులపై దాడులు జరిగాయి. ఇది సరికాదు.
ఇక, అదానీ గ్రూప్ కంపెనీల్లో అవకతవకలు జరిగాయని హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదికతో అదానీ వ్యాపార సామ్రాజ్య పునాదులు కదిలిపోయాయి. అయితే, హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌ను భారత్‌పై జరిగిన దాడిగా అదానీ గ్రూప్ అభివర్ణించింది. అయితే, ఈ వాదన మదుపర్లకు సంతృప్తినివ్వలేదు. అందుకే, కొద్ది రోజుల్లోనే 11 వేల కోట్ల డాలర్ల అదానీ సంపద ఆవిరైంది. పలు సూచీలు అదానీ గ్రూప్‌నకు రేటింగ్ తగ్గించాయి.
అదానీ ఉదంతంపై దర్యాప్తు చేపట్టాలని పార్లమెంట్‌లో విపక్షాలు పట్టుబట్టాయి. అయితే, కేంద్రం పట్టించుకోలేదు. అదానీ వివాదాన్ని పట్టించుకోని కేంద్ర దర్యాప్తు సంస్థలు.. బీబీసీ ముంబై, ఢిల్లీ కార్యాలయాల్లో మాత్రం సోదాలు నిర్వహించాయి. తమ ఉనికి బయటపెట్టకుండా కార్పొరేట్లు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేలా 2016లో బీజేపీ ప్రభుత్వం ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని తీసుకొచ్చింది. ప్రపంచ కుబేరుడైన అదానీ, ప్రపంచంలోనే అత్యంత ధనిక పార్టీగా పిలుస్తున్న బీజేపీకి ఏమైనా విరాళాలు ఇచ్చారా? అదానీ, బీజేపీ ఖాతా పుస్తకాలు ఒకటేనా? వేర్వేరా?
పార్లమెంట్‌లో 90 నిమిషాలు ప్రసంగించిన మోదీ.. విపక్షాలు ఎంత గగ్గోలు పెట్టినా అదానీ ప్రస్తావన తీసుకురాలేదు. ఉద్యోగం లేక, పేదరికంతో గ్రామాల్లో బతుకుతూ, తామిచ్చే రేషన్‌తో బతికే కోట్లాది మంది ప్రజలకు 10 వేల కోట్ల డాలర్ల గురించి (అదానీ-హిండెన్‌బర్గ్ వివాదం) అవగాహన లేదని (వ్యంగ్యంగా) మోదీ అనుకున్నారు కావొచ్చు. అందుకే, అదానీ గురించి ప్రస్తావించలేదు.
------------------------------------------------------------------------------------------------------------------
7. Ukraine | రష్యా – ఉక్రెయిన్ యుద్ధానికి ఏడాది.. ఎవరు తగ్గుతారో! ఎవరు నెగ్గుతారో!
వారాలు.. నెలలు అనుకున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఏడాదికి చేరుకుంది. రష్యా ఆక్రమణతో మొదలైన ఈ యుద్ధం ఉక్రెయిన్ వీరోచిత ప్రతిఘటనతో ఇంతకాలంగా కొనసాగుతూ వస్తున్నది. ఇప్పటికే అంతర్జాతీయంగా తీవ్ర ప్రభావం కలిగించిన ఈ యుద్ధం ఎలా ముగుస్తుందా అని ప్రపంచం ఆశతో ఎదురు చూస్తున్నది. కానీ, అది ఇప్పట్లో నెరవేరేలా కనిపించటం లేదు. పుతిన్‌గానీ, జెలెన్‌స్కీగానీ ఏమాత్రం వెనక్కి తగ్గటం లేదు. రష్యా ఓడితే అమెరికా, యూరప్ దేశాల పంతం నెరవేరినట్లవుతుంది. రష్యా ప్రభావం అంతర్జాతీయంగా తగ్గుతుంది. గెలిస్తే మాత్రం నాటోకు, రష్యాకు మధ్య కొత్త వివాదాలు తలెత్తే అవకాశాలున్నాయి. ఫలితంగా మరిన్ని యుద్ధాలను ప్రపంచం చూడవలసి రావచ్చు.
ఇప్పటి వరకూ జరిగిన యుద్ధాన్ని పరిశీలిస్తే మాత్రం.. రష్యాను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ పోరాట పటిమ యావత్ ప్రపంచానికి తెలిసి వచ్చింది. రష్యా క్షిపణుల వర్షాన్ని, వైమానిక దాడుల్ని, ఆ దేశ సైనికులు జరిపిన దారుణ మారణాకాండను తట్టుకొని ఉక్రెయిన్ నిలబడటం మామూలు విషయం కాదు. దీనికి ప్రధాన కారణం ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. అతడి సారథ్యంలోని ప్రజలు, సైన్యం. మాతృభూమి రక్షణ కోసం రష్యాను అడుగడుగునా నిలువరిస్తూ పోరాడుతున్నారు. రష్యాను ఏకాకిని చేయటంలో, అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టటంలో జెలెన్‌స్కీ విజయం సాధించారు. యూరప్ దేశాలు, అమెరికా అందిస్తున్న ఆయుధాలు, టెక్నాలజీ, ఆర్థికసాయం ఉక్రెయిన్‌ను యుద్ధరంగంలో నిలబెట్టగలిగాయి. రష్యాను బలహీనపరచటంలో ఆయా దేశాలు తమ ప్రయోజనాలను చూసుకుంటున్నాయి. కానీ, కాలం గడిచే కొద్దీ వాటి నుంచి ఉక్రెయిన్‌కు అందుతున్న సాయం కూడా తగ్గుతున్నది. ఈ నేపథ్యంలో రష్యా పైచేయి సాధించి, ఉక్రెయిన్‌ను లొంగదీసుకుంటుందా అన్నది వేచి చూడాల్సిందే.
యుద్ధం ఉక్రెయిన్-రష్యాలకు ఎంత సంకట పరిస్థితులను నెలకొల్పిందో ప్రపంచ దేశాలకు కూడా అటువంటి పరిస్థితులనే కల్పించింది. సముద్ర రవాణా మార్గాలు, ఎగుమతులు, దిగుమతులు, చమురు సరఫరా వంటి కీలక రంగాలపై ఈ యుద్ధం తీవ్ర ప్రభావం కలిగించింది. అసలే కరోనా కరాళనృత్యంతో అతలాకుతలమైన ప్రపంచంపై ఈ యుద్ధం.. మూలిగే నక్క మీద తాటిపండులా మారింది. పలు దేశాల్లో చమురు ధరలు, నిత్యావసరాలు విపరీతంగా పెరిగిపోయాయి. ద్రవ్యోల్బణం అధికమై ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రమైంది. ప్రపంచీకరణ యుగంలో ఒక దగ్గర సంభవించే పరిణామం మొత్తం ప్రపంచం మీద పడుతుందనడానికి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఒక ఉదాహరణ. ఐక్యరాజ్యసమితి వంటి తటస్థ సంస్థల సామర్థ్యలేమికి కూడా ఈ పరిణామం ఒక సంకేతం. ఎంతటి సమస్యనైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు అనే ప్రజాస్వామిక సూత్రం నేటికీ మాటలకే పరిమితమవుతున్నది. అంతర్జాతీయంగా అన్ని దేశాలు చొరవ చూపి ఈ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉంది.
------------------------------------------------------------------------------------------------------------------------
8. ఊపిరి బిగపట్టిన ఉద్యమ సన్నివేశం
తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన సొంత రాష్ట్ర ఏర్పాటును పార్లమెంటు ఆమోదించడం చరిత్రలో మరుపు రాని రోజు. హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే లోకసభలో ఫిబ్రవరి 13న తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టారు.
2014 ఫిబ్రవరి 20- తెలంగాణ చరిత్రలో మరుపురాని రోజు. అప్పటికే లోక్‌సభ ఈ బిల్లును ఆమోదించిన సందర్భంలో ఆంధ్ర సభ్యులు నానా గందరగోళం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ బిల్లు రాజ్యసభ ఆమోదానికి వచ్చినపుడు తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. దేశ విదేశాల్లోని తెలంగాణ బిడ్డలు ఆందోళనతో ఊపిరి బిగపట్టి చూస్తున్న సందర్భమది. ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఆందోళన చెప్పనలవికాదు. తన ప్రయత్నాలను తీవ్రంగా సాగించారు. ఉద్వేగభరిత సన్నివేశంలో తెలంగాణ బిల్లును ఫిబ్రవరి 20న రాజ్యసభ కూడా ఆమోదించింది. పార్లమెంట్ ఆమోదం పొందడంతో తెలంగాణ ప్రజల సంబురాలు అంబరాన్నంటాయి
ఆనాడు తెలంగాణను ఆంధ్రతో విలీనం చేయడానికి ముందు పార్లమెంట్ భవన సమీపంలోని హైదరాబాద్ హౌజ్‌లోనే 1956 ఫిబ్రవరిలో సరిగ్గా 20వ తేదీనే ‘జెంటిల్‌మెన్ అగ్రిమెంట్’ పై సంతకాలు జరిగాయి. 57 ఏండ్ల తర్వాత 2014లో ఫిబ్రవరి 20న ఆంధ్ర నుంచి తెలంగాణ వేరు పడాలనే నిర్ణయం జరిగింది. ముడిపడ్డ రోజే వేరు పడటం యాదృచ్ఛికమే.
తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన సొంత రాష్ట్ర ఏర్పాటును పార్లమెంటు ఆమోదించడం చరిత్రలో మరుపు రాని రోజు. హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే లోకసభలో ఫిబ్రవరి 13న తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టారు. అంతలోనే టీడీపీ సభ్యుడు ఎం పీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి లోకసభ కార్యదర్శి టేబుల్ పై మైకు విరగ్గొట్టాడు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు సోనియాకు, ప్రధానికి, స్పీకర్‌కు రక్షణ వలయంగా నిలబడ్డారు. కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ముందుగా టేబుల్ పై గ్లాసు పగులగొట్టి, పెప్పర్ స్ప్రేను స్పీకర్ పై, సభ్యులపై చిమ్మారు. స్పీకర్‌తో సహా పలువురు ఎంపీలు అస్వస్థతకు గురయ్యారు. సభను వాయిదా వేసిన స్పీకర్ ఈ ఘటన పై తీవ్రంగా స్పందించారు. ‘షేమ్ ఆన్ పార్లమెంటరీ డెమోక్రసీ’ అని మీడియా ముందు వ్యా ఖ్యానించారు. కొద్ది సేపటికే సభను తిరిగి ప్రా రంభించి 16 మంది సీమాంధ్ర ఎంపీలతో పా టు తెలంగాణ ఎంపీలైన పొన్నం, గుత్తాను ఫిబ్రవరి 20 దాకా స్పీకర్ సస్పెండ్ చేశారు. ‘పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో ఇదొక చీకటి రోజు’ అని జాతీయ మీడియా వ్యాఖ్యానించింది. విభజన తప్పదని తెలిసి తమ ప్రాం తానికేం కావాలో అడగకుండా ‘ఏం చేసైనా విభజనను ఆపుతామని’ ఆంధ్ర నేతలు భావించడం వారి మూర్ఖత్వానికి నిదర్శనం.
సభను ప్రారంభించడానికి కొద్ది నిముషాలకు ముందు స్పీకర్ మీరాకుమార్ ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్‌ను తన ఛాంబర్ కు పిలిచి మాట్లాడారు. స్పీకర్ అడిగిన ప్రశ్నలకు సుష్మా స్వరాజ్ సంతృప్తికరమైన సమాధానాలిచ్చారు. బీజేపీ అగ్రనేత అద్వాని తన పార్లమెంటరీ కార్యాలయం లోనే ఉండి పరిణామాలను గమనిస్తున్నారే తప్ప సభలోనికి రావడం లేదు. అయినా తెలంగాణ బిల్లుకు మద్దతిస్తామని తెలిపారు. మరోపక్క కేసీఆర్ సభలో పరిణామాలను గమనిస్తూ తెలంగాణ ఎంపీలకు, టీఆర్‌ఎస్‌లో చేరిన సీనియర్ కాంగ్రెస్ నేతలకు సూచనలనిస్తూ వచ్చారు. వీరంతా అప్పటికే స్పీకర్ మీరాకుమార్‌ను బిల్లు పెట్టాలని ప్రార్ధించారు. సభ ఆర్డర్‌లో లేనప్పుడు బిల్లు పెట్టడం సాధ్యంకాదని పార్లమెంటరీ వ్యవహారాలమం త్రి కమలనాథ్, ప్రతిపక్షనేత సుష్మా స్వరాజ్ స్పీకర్‌కు తెలిపారు. జైపాల్‌రెడ్డి ఇలాంటి సందర్భంలో స్పీకర్‌కు గల అధికారాలను గుర్తు చేస్తూ ఆర్టికల్ 367 (3) ద్వారా ఓటింగ్ అవసరం లేకుండానే బిల్లుకు మద్దతిచ్చే సభ్యులు, పార్టీల ఎంపీల తలలు లెక్కిస్తే (హెడ్ కౌంట్) సరిపోతుందని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల సంఖ్యే మూడింట రెండొంతులకు పైగా ఉందని, బిల్లు ఆమోదానికి సింపుల్ మెజారిటీ చాలని సూచించారు.
బిల్లు పై మాట్లాడవలసిందని హోం మంత్రి షిండేను స్పీకర్ కోరారు. అనంతరం ప్రతిపక్షనేత సుష్మా స్వరాజ్ కు అవకాశం ఇచ్చారు. ఆ తరువాత జైపాల్‌రెడ్డిని మాట్లాడమని సోని యా సూచించారు. రెండు ప్రధాన పార్టీలు బిల్లుకు మద్దతివ్వడంతో మూజువాణి ఓటుతో లోకసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించారు. ఈ బిల్లుపై మజ్లిస్, బీజేపీ, ఇతర పార్టీలు చేసిన సుమారు 38 సవరణలన్నీ తిరస్కరించబడ్డాయి. ప్రతి సవరణపైనా ఓటింగ్ జరిగింది. విపక్షాల సవరణలన్నీ వీగిపోయాయని మంత్రి నారాయణ స్వామి ప్రకటించారు.
దీంతో సంతోషంగా సభలోనుంచి బయటికి వచ్చారు తెలంగాణ ఉద్యమనేత, ఎంపీ కేసీఆర్. తెలంగాణ ఎం.పీలంతా సంబురంగా సభ బయట ఉన్నవారిని ఆలింగనం చేసుకున్నారు. ఆంధ్ర ఎంపీలకు తెలంగాణ బిల్లును రాజ్యసభలో అడ్డుకుంటామనే ఆశ ఇంకా పోలేదు. ఏదో ఒక సవరణను రాజ్యసభ ఆమోదించేలా చేస్తే చాలు. ఆ బిల్లు లోక్‌సభలో ఓటింగ్‌కు వెళ్ళాల్సి ఉంటుంది. అప్పటికే 15వ లోక సభ రద్దయింది. వచ్చే ప్రభుత్వం నరేంద్ర మోదీదే అయితే ఆయన తెలంగాణ ఏర్పాటు కు వ్యతిరేకంగా ఉన్నారు. ఇదే జరగాలని వెంక య్య నాయుడు, ఆంధ్ర ఎంపీలు కోరుకున్నా రు. రాజ్యసభ బిల్లును ఆమోదిస్తుందో లేదోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది .
ఫిబ్రవరి 19న తెలంగాణ బిల్లు రాజ్యసభకు వచ్చింది. గందరగోళం మధ్య పలుమార్లు సభ ను వాయిదా వేయవలసి వచ్చింది. ఫిబ్రవరి 20 న కూడా గందర గోళం నెలకొన్నది. ఆంధ్ర ఎంపీలంతా స్పీకర్ పోడియం వద్ద నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. పలుసార్లు సభను వాయిదా వేసిన రాజ్యసభ చైర్మన్ కురియన్ అన్ని పార్టీల నేతలను తన ఛాంబర్‌కు పిలిచి సభను సజావుగా జరగనివ్వాలని కోరా రు. సాయంత్రం నాలుగింటికి సభ కొలువుదీరింది. తెలంగాణ బిల్లుపై ప్రధాన పార్టీలకు ఏకాభిప్రాయం ఉన్నదని, చర్చ మాత్రమే జరగాలని సభ్యులు పట్టుబడుతున్నారని చైర్మన్ కురియన్ సీట్లోంచి లేచి ప్రకటించారు. హోం మంత్రి షిండే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టగా, దీనిపై సాధారణ చర్చకు అనుమతిస్తున్నట్లు కురియన్ ప్రకటించారు.
వెంకయ్యనాయుడు ప్రసంగిస్తూ కొన్ని అంశాలపై వివరణ కోరగా మంత్రి జైరాం రమేశ్ సమాధానాలిచ్చారు. బిల్లులోని వివిధ క్లాజులను మూజువాణి ఓటు తో ఆమోదించారు. వెంకయ్యనాయుడు ఓటింగ్‌కు పట్టుబడుతూ డివిజన్‌ను కోరగా సభ్యుల ఆందోళనల నడుమ డివిజన్ జరపలేమని, లోకసభ మాదిరిగానే జరుగుతుందని కురియ న్ స్పష్టం చేశారు. పలు సవరణలను ఒక్కొక్కటిగా వెంకయ్య నాయుడు ప్రవేశ పెడుతూ వచ్చారు. ఒక్కొక్క సవరణను సభ మూజువా ణి ఓటుతో తిరస్కరిస్తూ వచ్చింది. పలు పార్టీల సభ్యులు సవరణలు సూచిస్తూ ఇచ్చిన నోటీసులను కురియన్ అడిగినపుడు వారు ఆ సవరణలను ప్రవేశపెట్టడం లేదని తెలిపారు. ప్రధాని మన్మోహన్ సభలోనే ఉన్నారు. ఏడేండ్ల పాటు ఆంధ్రకు స్పెషల్ స్టేటస్ ఇస్తామని ప్రధాని తెలిపారు.
ఈ గందరగోళాన్ని సభ గ్యాలరీ నుంచి గమనిస్తున్న కేసీఆర్‌కు, ఇతర ఎంపీలకు ఒక దశలో తలలో నరాలు చిట్లెంత టెన్షన్ కలిగింది. ఒకదశలో తాను కన్నీళ్ళు పెట్టుకున్నట్లు కేసీఆర్ ఆ తర్వాత తెలిపారు. రాజ్యసభలో ఏ సవరణా ఆమోదం పొందలేదు. మూజువాణి ఓటుతో ‘ది బిల్ ఈజ్ పాస్డ్’
అని కురియన్ ప్రకటించారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెర వేరింది. అందరి కండ్లల్లో ఆనంద బాష్పాలు!
ఆనాడు తెలంగాణను ఆంధ్రతో విలీనం చేయడానికి ముందు పార్లమెంట్ భవన సమీపంలోని హైదరాబాద్ హౌజ్‌లోనే 1956 ఫిబ్రవరిలో సరిగ్గా 20 తేదిన ‘జెంటిల్ మెన్ అగ్రిమెంట్’ పై సంతకాలు జరిగాయి. 57 ఏండ్ల త ర్వాత 2014లో ఫిబ్రవరి 20న ఆంధ్ర నుంచి తెలంగాణ వేరుపడాలనే నిర్ణ యం జరిగింది. ముడిపడ్డ రోజే వేరు పడటం యాదృచ్ఛికమే.
-----------------------------------------------------------------------------------------------------------------
9. కార్మికులపైనా కషాయం
సింగరేణికి మహర్దశ రావాలన్నా, కేంద్రం కుట్రలకు అడ్డుకట్ట పడాలన్నా, కార్మికులకు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలుకావాలన్నా, దశాబ్దాల తరబడి కేంద్రం వద్ద ఉన్న అనేక పెండింగ్ సమస్యలకు పరిష్కారం లభించాలన్నా కేంద్రంలో బీఆర్‌ఎస్ ఉంటేనే సాధ్యమవుతుందని సింగరేణి కార్మిక లోకం బలంగా నమ్ముతున్నది.
దేశ రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) కొత్త విప్లవాన్ని సృష్టిస్తున్నది. సమస్య ఏదైనా.. పరిష్కరించే సత్తా, సామర్థ్యం ఉన్న నాయకుడు కేసీఆర్. ఆయన అధ్యక్షతన ఏర్పడిన బీఆర్‌ఎస్ ద్వారా కేవలం మా సమస్యలే కాదు, దేశంలోని సమూల మార్పులు సాధ్యమని సింగరేణి కార్మిక లోకం నమ్ముతున్నది. 103 ఏండ్ల సింగరేణి చరిత్రను తిరగరాసి.. కేవలం ఎనిమిదేండ్లలో ప్రభుత్వరంగ సంస్థ దిశ దశను మార్చడమే కాదు, దేశంలోనే నంబర్ వన్ సంస్థగా తీర్చిదిద్దేందుకు జరుగుతున్న ప్రయత్నాలు, రూపుదిద్దుకున్న ప్రణాళికలే అందుకు కారణం.
సింగరేణికి కొత్త బ్లాక్‌లు దక్కాలంటే కేంద్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉండాలన్న అభిప్రాయం కార్మికుల్లో కనిపిస్తున్నది. ఇదే కాదు, కేంద్రం పరిధిలో అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలు పరిష్కారం కావాలంటే దేశానికి కేసీఆర్ నాయకత్వం కావాలన్న భావన కార్మికుల్లో వ్యక్తమవుతున్నది.
సింగరేణికి మహర్దశ రావాలన్నా, కేంద్రం కుట్రలకు అడ్డుకట్ట పడాలన్నా, కార్మికులకు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలుకావాలన్నా, దశాబ్దాల తరబడి కేంద్రం వద్ద ఉన్న అనేక పెండింగ్ సమస్యలకు పరిష్కారం లభించాలన్నా కేంద్రంలో బీఆర్‌ఎస్ ఉంటేనే సాధ్యమవుతుందని సింగరేణి కార్మిక లోకం బలంగా నమ్ముతున్నది. సింగరేణి కార్మికలోకం అసలు బీఆర్‌ఎస్ వైపు ఎందుకు చూస్తున్నదని పరిశీలిస్తే…. ఆ సంస్థపై కేంద్రం చూపుతున్న వివక్ష, స్వరాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, మూలాలను లోతుగా చూడాల్సిన అవసరం ఉన్నది. గలగలా పారే గోదావరి పాదాల చెంతన 350 కిలోమీటర్ల పొడవున ఆరు జిల్లాల్లో సింగరేణి విస్తరించి ఉన్నది. 1889లో ఇల్లెందు ఏరియాలోని సింగరేణి గ్రామం వద్ద బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించి.. డిసెంబర్ 23, 1920లో సింగరేణి కాలరీస్ కంపెనీగా పేరు మార్చుకున్నది. 1945లో నిజాం ప్రభువు సింగరేణి షేర్లను కొనుగోలు చేయడంతో తొలి ప్రభుత్వరంగ సంస్థగా మారింది. ఇప్పటికే సింగరేణి పరిధిలో 26 భూగర్భ, 20 ఉపరితల గనులున్నా యి. దాదాపు 43 వేల పైచిలుకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. స్వరాష్ట్రంలో కొత్తగా కారుణ్య నియామకాలు, వివిధ నోటిఫికేషన్ల ద్వారా 17 వేలకు పైగా పోస్టులను భర్తీ చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో చీకట్లు అలుముకున్న సింగరేణి స్వరాష్ట్రంలో పరుగులు పెడుతున్నది. యజమాని, శ్రామిక సంబంధాలను మానవ సంబంధాలుగా మారుస్తూ సింగరేణి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నది. లాభాల వాటా, కారుణ్య నియామకాలు, దసరా బోనస్, కార్మికుల సొంత గృహాల కోసం రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణం, కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్య సదుపాయం, సంస్థ సాధించిన లాభాల్లో కార్మికులకు 10 శాతంగా ఉన్న వాటాను క్రమంగా 30 శాతానికి పెంచింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కార్మికులకు నజరానాగా తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలో అతిపెద్ద బొగ్గు పరిశ్రమ అయినా కోల్ ఇండియా కన్నా.. మెరుగైన సంక్షేమ పథకాలు, అలవెన్సులు, లాభాల్లో కార్మికులకు భాగస్వామ్యం కల్పిస్తున్న సంస్థ ఒక్క సింగరేణి మాత్రమే. 2013-14లో రూ.11,928 కోట్లుగా ఉన్న టర్నోవర్.. ప్రస్తుతం రూ.26,586 కోట్లకు పైగా పెరగడం స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతికి నిదర్శనం. ఈ పరిస్థితుల్లోనే కేవలం సంప్రదాయ బొగ్గు ఉత్పత్తికి మాత్రమే పరిమితం కాకుండా థర్మల్, సౌర విద్యుత్తు ఉత్పత్తి రంగాల్లోకి ప్రవేశించి.. మంచి విజయాలను సంస్థ సాధిస్తున్నది. భవిష్యత్తులో మరిన్ని వినూత్న వ్యాపారాల్లోకి ప్రవేశించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. వచ్చే యాభై ఏండ్ల వరకు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నది.
బీఆర్‌ఎస్ వైపు కార్మికుల చూపు: అనేక ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసి కార్పొరేటు కంపెనీలకు ధారాదత్తం చేసిన కేంద్రం సింగరేణిని కూడా అదే బాటలో కలిపేందుకు దొడ్డిదారుల్లో వెళ్తున్నది. సింగరేణికి చెందిన కల్యాణ్‌ఖని బ్లాక్-6, కోయగూడెం బ్లాక్-3, సత్తుపల్లి బ్లాక్-3, శ్రావణ్‌పల్లి బ్లాకులను ప్రైవేటీకరణ చేసేందుకు తన కుట్రలను అమలుచేస్తున్నది. ఇప్పటికే కోయగూడెం బొగ్గు బ్లాకును అరబిందో ఫార్మా కంపెనీకి అంటగట్టేందుకు నిర్ణయం తీసుకున్నది. 2022 నవంబర్ 12న గోదావరిఖని వచ్చిన ప్రధాని మోదీ సింగరేణిని ప్రైవేటీకరణ చేయబోమని సభా వేదికగా హామీ ఇచ్చిన మరుసటి రోజు నుంచే ప్రైవేటీకరణ కుట్రలు మరింత వేగవంతమయ్యాయి. ఈ కుతంత్రాలకు అడ్డుకట్టపడి.. సింగరేణికి కొత్త బ్లాక్‌లు దక్కాలంటే కేంద్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉండాలన్న అభిప్రాయం కార్మికుల్లో కనిపిస్తున్నది.
ఇదే కాదు, కేంద్రం పరిధిలో అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలు పరిష్కారం కావాలంటే దేశానికి కేసీఆర్ నాయకత్వం కావాలన్న భావన కార్మికుల్లో వ్యక్తమవుతున్నది. ఇందుకు అనేక ఉదాహరణలున్నాయి. మచ్చుకు ఒక్కటి తీసుకుంటే త్రివిధ దళాల మాదిరిగానే సింగరేణి కార్మికులకు ఇన్‌కంటాక్స్ మినహాయింపు నివ్వాలని కోరుతూ 2014 జూన్ 4న అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. తొమ్మిదేండ్లు గడిచినా ఉలుకు లేదు, పలుకు లేదు. పార్లమెంట్ సమావేశాల్లోనూ తెలంగాణ ఎంపీలు పలుమార్లు ఈ అంశాన్ని లేవనెత్తినా అవేం తమకు పట్టవన్నట్లుగా కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నది. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానానికి పరిష్కారం చూపకపోగా.. కార్మికుల వేతనాల నుంచి ఆదాయపన్ను పేరిట ఏటా కోట్లు దండుకుంటున్నది.
సింగరేణిలో రాష్ర్టానికి 51 శాతం వాటా ఉంటే కేంద్రానిది 49 శాతం వాటా. కేంద్రం కుట్రలను ఉహించిన సీఎం కేసీఆర్ ప్రభు త్వం వచ్చిన తొలినాళ్లలోనే కేంద్ర 49 శాతం వాటాను కూడా కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని స్వయంగా లేఖ రాశారు. కానీ, కేంద్రం ఇప్పటికీ సమాధానం ఇవ్వలేదు.
కేంద్రం చిన్నచూపు: బొగ్గు గని కార్మికులకు ఐదేండ్లకోసారి అమలుచేయాల్సిన వేతన ఒప్పందాలు ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నా యి. వేజ్‌బోర్డు సమావేశాలను తరచూ వాయి దా వేస్తున్నది. 2021, జూలై 1 నుంచి అమ లుకావాల్సిన వేతన ఒప్పందానికి అతీగతి లేదు. గడిచిన రెండు దశాబ్దాలుగా పింఛన్‌లో పెరుగుదల లేదు. సింగరేణి ఒకవైపు తన పరిధిని ఇతర రాష్ర్టాలకు విస్తరించుకుంటూనే పలు బొగ్గు గనులను దక్కించుకొని ముందు కు సాగుతుంటే కేంద్రం చిన్నచూపు చూడటాన్ని కార్మికులు జీర్ణించుకోలేకపోతున్నారు. కేంద్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉంటే కార్మికుల పరిస్థితి బాగుంటుందని కార్మిక లోకం ఆశిస్తున్నది. కార్మికుల హక్కులు, వారి సంక్షేమం, సింగరేణికి మహర్దశ రావాలంటే కేంద్రంలో బీఆర్‌ఎస్ ఉండాలన్నదే కార్మికుల బలమైన డిమాండ్‌గా వినిపిస్తున్నది.
(వ్యాసకర్త: కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ)
-కడపత్రి ప్రకాశ్‌రావు
------------------------------------------------------------------------------------------------------------------
10. Boddemma Panduga | తెలంగాణ సంప్రదాయమైన బొడ్డెమ్మ పండుగను ఎలా జరుపుకుంటారు? బొడ్డెమ్మను ఎలా తయారు చేస్తారు?
Boddemma Panduga | బొడ్డెమ్మ పండుగ అనగానే తెలంగాణ రాష్ట్రంలో అత్యంత సంప్రదాయబద్ధంగా చేసుకునే రెండు పండుగలు గుర్తుకువస్తాయి. అవే బొడ్డెమ్మ, బతుకమ్మ,పండుగలు. ఈ పండుగలు తెలంగాణ ఆడపడుచులకు అత్యంత ఇష్టమైన పండుగలు.
Boddemma Panduga | బొడ్డెమ్మ పండుగ అనగానే తెలంగాణ రాష్ట్రంలో అత్యంత సంప్రదాయబద్ధంగా చేసుకునే రెండు పండుగలు గుర్తుకువస్తాయి. అవే బొడ్డెమ్మ, బతుకమ్మ,పండుగలు. ఈ పండుగలు తెలంగాణ ఆడపడుచులకు అత్యంత ఇష్టమైన పండుగలు. తెలంగాణ సంప్రదాయం పాటించే వారు తప్పకుండా బొడ్డెమ్మ పండుగ జరుపుకొంటారు.
బొడ్డెమ్మ పండుగ బతుకమ్మ పండుగకు ముందు వస్తుంది. ఈ పండుగను ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా జరుపుకొంటారు. భాద్రపద మాసంలో వచ్చే మహాలయ అమావాస్యకు ముందు, వినాయక చవితి మరుసటి రోజు బహుళపంచమి నుంచి 9 రోజులు ఈ పండుగను జరుపుకొనేవారు కొందరైతే , మరికొందరు 5 రోజులు, మూడు రోజులు దశమి, ద్వాదశి నుంచి జరుపుకొనేవారు మరి కొందరు. ఈ పండుగను బొడ్డెమ్మల పున్నమి అని కూడా అంటారు. ముఖ్యంగా ఈ పండుగను చిన్నవారైన ఆడపిల్లలు, పెండ్లి కాని అమ్మాయిలతో జరిపిస్తారు. ఇందులో పెండ్లయిన స్త్రీల ప్రమేయం ఉండదు. కన్నెపిల్లలు, బాలికలు ఈ పండుగను భక్తి శ్రద్ధలతో మంచి భర్త రావాలని కోరుకుంటూ ఎంతో సంతోషంగా జరుపుకొంటారు.
బొడ్డెమ్మ పండుగ ప్రకృతి పండుగ. మట్టితో ప్రకృతిలోని పూలతో అనుబంధం ఉన్న పండుగ ఇది. మనిషికి మట్టికి, ప్రకృతికి ఉన్న బంధం గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఇక ఆయా ప్రాంతాలను బట్టి బొడ్డెమ్మ నిర్మాణం మారుతూ ఉంటుంది. బొడ్డెమ్మ తయారుచేసే విధానాల్లో ఐదు రకాలుంటాయి. చేసే విధానాన్ని బట్టి ఆ బొడ్డెమ్మలకు పీట బొడ్డెమ్మ, గుంట బొడ్డెమ్మ, పందిరి బొడ్డెమ్మ, బాయి బొడ్డెమ్మ, అంతరాల బొడ్డెమ్మ అని ఐదు రకాలుగా బొడ్డెమ్మలని పిలుస్తారు.
బొడ్డెమ్మ పండుగ మూలాలు: బొడ్డెమ్మలో బొడ్డ అనే పదానికి అత్తి చెట్టు/ లేదా మేడిచెట్టు/ ఔదుంబర వృక్షం అని కూడా పేరు. ఈ చెట్టును పూజించడానికి కారణం ఎన్నో ఔషధీయ గుణాలు కలిగి ఉండటమే కాకుండా, అనేకరకాల అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ముఖ్యంగా సంతాన సాఫల్యానికి, స్త్రీలలో వచ్చే యోని సంబంధమైన రోగాలకు దివ్యౌషధం. అందుకేనేమో ప్రకృతికి, స్త్రీ జీవితానికి గల సంబంధాన్ని గుర్తు చేసుకునేవిధంగా ఈ పండుగ జరుపుకోవడమనేది కారణమై ఉండవచ్చు.
ఖమ్మం జిల్లాలోని గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉన్న కొత్తగూడెం భద్రాద్రి వైపు, మహబూబాబాద్‌లో కలిసిన ఖమ్మం జిల్లా మండలాల్లో తెలంగాణ సంస్కృతితో ప్రభావితమైన ప్రాంతాల్లో ఈ బొడ్డెమ్మ పండుగ చేసుకోవడం విశేషం.ఈ జిల్లాలో గిరిజన ప్రాంతాలన్నీ దాదాపుగా దట్టమైన అడవుల మధ్యే ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో నివసించే వారికి ఏయే చెట్టు ఎలాంటి అనారోగ్యం పోగొడుతుందో తెలుసు. ఆరోగ్య సంబంధిత విషయాలకు, అటవీ ప్రాంతంలో ఉండే చెట్లు ఎం తగా ఉపయోగపడుతాయో వారికి బాగా తెలుసు. అందుకే వారిలో కొందరు ఈ పండుగను జరుపుకొంటున్నారు.
బొడ్డెమ్మను తయారు చేసే విధానం: ఖమ్మం జిల్లాలో ఎక్కువగా పీట బొడ్డెమ్మను తయారు చేసి పూజిస్తారు. ఈ పండుగ జరుపుకొనే వారికి ఆనవాయితీ ఉంటుంది. బతుకమ్మను పేర్చినట్లు ఇంటింటా బొడ్డెమ్మను పేర్చరు. కేవలం ఆనవాయితీ ఉన్న వారు మాత్రమే ఊరికి ఏ ఒక్కరో తయారుచేస్తారు. ఆ బొడ్డెమ్మనే ఊరిలోని పెళ్లి కాని ఆడపిల్లలంతా కలిసి కొలుస్తారు.
ముఖ్యంగా పీట బొడ్డెమ్మను తయారుచేయాలంటే చతురస్రాకారంలో ఉన్న చెక్క పీట కావాలి. అడవి నుంచి పుట్టమన్ను తేవాలి. పిండిల కలిపి పీట మీద గుండ్రంగా ఐదు దొంతరలుగా పేర్వాలి. పై దాకా గోపురం ఆకారంలో వచ్చేలా చేయాలి. ఆ పైన ఓ చిన్న గిన్నె, అందులో పసుపు గౌరమ్మ పెడతారు. ఈ విధంగా బొడ్డెమ్మను తయారు చేసిన తర్వాత ఎవరికైతే ఆనవాయితీ ఉంటుందో వాళ్ల ఇంటి ఆవరణలో ఊడ్చి శుభ్రం చేసి ఎర్రమట్టితో అలికి, మంచిగా ముగ్గులు వేస్తారు.
మధ్యలో ఈ బొడ్డెమ్మను పెట్టి, రకరకాల పూలతో అలంకరించి, కన్నెపిల్లలు బాలికలు చుట్టూ తిరుగుతూ ‘బొడ్డెమ్మ బొడ్డెమ్మా కోల్- బిడ్డాలెందరూ కోల్’ అంటూ కోలాటం ఆడుతారు. చివరలో ‘నిద్రపో బొడ్డెమ్మ నిద్ర పోవమ్మా. నిద్రాకు నూరేండ్లు-నీకు వెయ్యేండ్లు. నిను గన్న తల్లీకీ నిండా నూరేండ్లు’ అంటూ పాడి తర్వాత బొడ్డెమ్మను జాగ్రత్తగా తీసి దేవుని ముందు పెడతారు. ఇలా 9 రోజుల పాటు ఆడి చెరువు దగ్గరికి తీసుకువెళ్తారు. అక్కడ చెక్కపీట మీద నుంచి బొడ్డెమ్మను తీసి నీటిలో నిమజ్జనం చేస్తూ ‘పోయి రా బొడ్డెమ్మ పోయి రావమ్మా’ అంటూ బొడ్డెమ్మతో పాటు ముందురోజుల వాడిపోయిన పూలను కూడా చెరువులో నిమజ్జనం చేస్తారు.
(‘అక్షరయాన్’ సౌజన్యంతో..)
వురిమళ్ల సునంద
----------------------------------------------------------------------------------------------------------------------
11. అప్పుల కొండపై ఎదిగిన అదానీ
షేర్ల ధరల్లో విన్యాసాలు, ఖాతా పుస్తకాల్లో మోసాలు తదితర అవకతవకల ద్వారా అదానీ గ్రూప్ కార్పొరేట్ చరిత్రలోనే అతి పెద్ద కుంభకోణానికి పాల్పడిందనేది న్యూయార్క్‌కు చెందిన హిండెన్‌బర్గ్ సంస్థ ఆరోపణ. దాంతో అదానీ గ్రూప్ మార్కెట్ విలువ భారీగా కోసుకుపోయింది. ఈ వివాదంపై సంయుక్త పార్లమెంటరీ సంఘంతో విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలు దేశంలో రాజకీయ, ఆర్థిక దుమారానికి దారితీశాయి. భారత్‌లో, ఆసియాలో అతి సంపన్నుల జాబితాలో గౌతమ్ అదానీ తనకున్న ర్యాంకును పోగొట్టుకున్నారు. ఈక్విటీ వాటాల విక్రయాన్ని రద్దు చేసి, మదుపరులకు వారి సొమ్ము వెనక్కి ఇస్తామని సైతం ప్రకటించారు. గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలను పరిశీలిస్తున్నామని భారత సెక్యూరిటీస్, ఎక్స్చేంజి బోర్డు (సెబి) సుప్రీంకోర్టుకు తెలిపింది.
అదానీ సంస్థలకు ఏ మేరకు రుణాలిచ్చినదీ తెలపాలని రిజర్వు బ్యాంకు భారతీయ ఆర్థిక సంస్థలను, బ్యాంకులను కోరింది. కొన్ని బ్యాంకులు ఆ మేరకు వివరాలను సమర్పించాయి. అదానీ గుట్టును హిండెన్‌బర్గ్‌కన్నా ముందు బయటపెట్టిన సంస్థ- ఫిచ్ గ్రూపునకు చెందిన క్రెడిట్ సైట్స్. అతిగా అప్పుల మీద ఆధారపడి వ్యాపారాన్ని విస్తరిస్తున్న అదానీ గ్రూప్ మున్ముందు సమస్యల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉందని ఆ సంస్థ వెల్లడించింది. రేవులు, హరిత ఇంధనాలు, విమానాశ్రయాలు, రహదారులు, సిమెంటు ఉత్పత్తి వంటి మౌలిక వసతుల ప్రాజెక్టులను ఆ గ్రూప్ అప్పుల ఆధారంగానే నడిపిస్తోంది. భారతదేశ అతి పెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఈ గ్రూపునకు సుమారు రూ.21 వేల కోట్లకు పైగా రుణాలు ఇచ్చింది. అదానీ సంస్థలకు అన్ని భారతీయ బ్యాంకులు కలిసి దాదాపు రూ.80,000 కోట్ల మేరకు రుణాలు ఇచ్చినట్లు అంచనా. ఇది అదానీ గ్రూపు మొత్తం రుణాలు రెండు లక్షల కోట్ల రూపాయల్లో 40 శాతానికి సమానం. ఈ రుణ కేంద్రిత వ్యాపారాభివృద్ధి వల్ల అదానీ ప్రపంచంలో నాలుగో అతి సంపన్నుడిగా ఆవిర్భవించగా, ఆయన వ్యాపార సామ్రాజ్యం మార్కెట్ విలువలో అంబానీ గ్రూపుకన్నా పెద్దదిగా నిలిచింది. టాటాల తరవాత అదానీ సంస్థలు రెండో అతిపెద్ద వ్యాపార గ్రూపుగా అవతరించాయి.
వేగంగా వృద్ధి
టాటా, అంబానీల సంస్థలు అగ్రస్థాయికి చేరుకోవడానికి ఎన్నో తరాలు పట్టగా- అదానీ గ్రూపు అతి కొద్ది సంవత్సరాల్లోనే శిఖరాగ్రానికి చేరుకుంది. దీనికి ప్రధానంగా మూడు కారణాలు తోడయ్యాయి. ప్రభుత్వ రంగ సంస్థలు చేపడుతూ వచ్చిన విద్యుత్, రేవులు, రహదారులు, విమానాశ్రయాల వంటి మౌలిక వసతుల ప్రాజెక్టులను అదానీ గ్రూప్ చేజిక్కించుకోవడం మొదటిది. వ్యాపారం చేయడం ప్రభుత్వం పని కాదని, అది ప్రైవేటు రంగం ద్వారానే జరగాలన్న నయా ఉదారవాద విధానంలో- ప్రైవేట్ పరిశ్రమలకు, కొద్దిమంది వ్యాపారవేత్తలకు ప్రోత్సాహం దక్కుతోంది. ఈ క్రమంలో అదానీ మౌలిక వసతుల ప్రాజెక్టులకు వేగంగా సులభంగా అనుమతులు, భూమి లభించాయి. అడిగినదే తడవుగా అప్పులు లభించడం అదానీ సంస్థల శీఘ్ర వృద్ధికి రెండో కారణం. అదానీ గ్రూపు ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచే కాకుండా భారత జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) వంటి సంస్థల నుంచీ భారీగా నిధులు సేకరించింది. 2022 ఆర్థిక సంవత్సరంలో గ్రూపు మొత్తం రుణాలు రూ.2.20 లక్షల కోట్ల రూపాయలు. గడచిన సంవత్సరంలోనే గ్రూపు మొత్తం రుణభారం 42 శాతం పెరిగింది. గ్రూపు బ్యాంకు ఖాతాలో ఉన్న నగదు కేవలం రూ.26,983 కోట్లు. అయినా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పోటీపడి అదానీ సంస్థలకు రుణాలు ఇచ్చాయి. స్టాక్ మార్కెట్‌లో అదానీ గ్రూపు వాటాల విలువ విపరీతంగా పెరిగిపోవడం ఆర్థికంగా ఎదగడానికి మూడో కారణం. అదానీ గ్రూపు కంపెనీల్లో వాటాదారుల స్వభావం వల్ల మార్కెట్ రేటు విపరీతంగా పెరిగిపోయి ఉండవచ్చు. ఈ గ్రూపులో పెట్టుబడి పెట్టిన అతికొద్ది విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపరుల (ఎఫ్‌పీఐ) వివరాలు బయటికి తెలియవు. ఈ మదుపరులు అదానీ గ్రూప్ షేర్ల ధరలు పైపైకి దూసుకుపోయేలా విన్యాసాలు చేశారు. అక్కడికీ జాతీయ సెక్యూరిటీస్ డిపాజిటరీ సంస్థ మూడు ఎఫ్‌పీఐ కంపెనీల ఖాతాలను స్తంభింపజేసింది.
ముందుజాగ్రత్త మేలు
భారతీయ బ్యాంకులు గతంలో చేసిన పొరపాట్ల నుంచి కొత్త పాఠాలేమీ నేర్చుకున్నట్లుగా కనిపించడం లేదు. అందుకే 2009లో 4.7 శాతంగా ఉన్న భారతీయ బ్యాంకుల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) 2016 వచ్చేసరికి 32.6 శాతానికి పెరిగిపోయాయి. మరోవైపు హర్షద్ మెహతా కుంభకోణం (1992), కేతన్ పరేఖ్ కుంభకోణం (2001), సత్యం కుంభకోణం (2008)లో మదుపరులు భారీగా డబ్బు పోగొట్టుకున్న తరవాత కూడా అదానీ ఉదంతం చోటుచేసుకోవడం నియంత్రణ సంస్థల పనితీరును పట్టి చూపుతోంది. ఇక ప్రధాన రాజకీయ పార్టీలకు అందే విరాళాల్లో 70 శాతం అజ్ఞాత వ్యక్తులు, సంస్థల నుంచి అందినవేనని రూఢి అయింది. మొత్తానికి ఆర్థిక రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎంత ముఖ్యం అనేది అదానీ ఉదంతం చాటిచెబుతోంది. ఈ గ్రూపు కుప్పకూలడం దేశార్థికానికి నష్టమనే అభిప్రాయాలూ కొన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఏదైనా జరగరానిది జరిగితే ఆ వైఫల్యానికి ప్రజలు మూల్యం చెల్లించుకోవలసిన దుస్థితి పట్టకుండా ముందు నుంచే జాగ్రత్తపడాల్సిన అవసరాన్ని ఈ ఉదంతం గుర్తుచేస్తోంది.
---------------------------------------------------------------------------------------------------------------------
Comments
Post a Comment